Monday, August 24, 2009

మీ వెంట నేనుంటా...



పోటీ పరీక్షల ప్రపంచం ఒక మహా సాగరం. తీరం చేరుకోవాలంటే అడుగడుగునా సుడిగుండాలే. వాటిని అధిగమించే ప్రయత్నంలో మీ వెంట నేనుంటా. IAS సాధించాలన్నది చాలామందికి స్వప్నం. ఆ కల నెరవేరాలంటే నిరంతర సాధన ఉండాలి. సాధనకు దిశానిర్దేశం తోడవ్వాలి. అందుకే ఈ బ్లాగు. సివిల్ సర్వీసెస్ పొదాలని తపించేవారికి ఇక్కడ సూచనలు, సలహాలు, వివిధ optionalsపై అవగాహన కలిగించడం, కాంపిటీటివ ఎగ్జామ్స్‌కు కావలసిన Personality ఎలా ఉండాలి ? తెలుగు లిటరేచర్, జాగ్రఫీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ లాంటి సబ్జెక్టులపై పట్టు ఎలా సాధించాలి ? IAS interviewకి ఎలా హాజరవ్వాలి ? లాంటి అనేకానేక అంశాలపై దృష్టి పెడుతుంది ఈ బ్లాగు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను అందించే ప్రయత్నం జరుగుతోంది.
మీ
ఆకెళ్ల రాఘవేంద్ర