పార్ట్ (ఎ)
1) ఈ క్రింది ప్రశ్నలలో మూడింటిని అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను తెలపండి.
ఎ) శిల్ప దృక్పథం
"పారావార గభీరికిన్ ద్యుతిలసత్పోద్మారికిన్ నిత్య వి
స్పారోదార విహారికిన్ సుజనరక్షా దక్ష దక్షారికిన్
సారాచార విచారికిన్ మదరిపుక్ష్మాపాల సంహారికిన్
వీరా సాటి నృపాలకుల్ ? దశరధోర్వీనాథ జంభారికిన్"
బి) చారిత్రక - సామాజిక దృక్పథం
"ఇట్టి నరర్ధునెందుగన మేమనఁబోయిన నీవు మిక్కిలిన్
దిట్టెదు, నాడు సంపదకు దిక్కగుచున్ మొగమొల్క నీకిఁకన్
బుట్టునొ యంటిమే, నీతని పొఁడియిఁగంటిమ ! వట్టి గొడ్డు తా
కట్టితఁడెంత యున్న, నినుఁగాఱియపెట్టుట వెళ్లఁగొట్టినన్"
సి) తాత్త్విక దృక్పథం
"మనమునఁ బక్షపాతగతి మాదెసమానుము, ధర్మనీతి వ
ర్తనములు రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధకిరా, నుచితులు తోడి యె
ల్పునఁబరుసందనంబునను భూపతుల్లె నెఱుంగ నాడుమీ"
డి) పాత్రల మనస్తత్వ దృక్పథం.
"అన్న ! మీ తండ్రి కోప గాండౌనో కాఁడో ?
యీవు పొనరించు దుర్వృత్త మెఱింగెనే నిఁ
గల్లతనమునఁ బలుమాఱు గప్పి పుచ్చు
నట్టి నామీదఁ జంపంగ నలుగకున్నె ?"
2) దుష్యంతుడిలో చెలరేగిన గార్హస్థ్య, ఆత్వాగత, ప్రభుధర్మాల మధ్య సంఘర్షణను, మానవ మనస్తత్వ రీతులను వివరించండి.
3) శ్రీనాధుడి గుణనిధి కథలోని తామస ప్రవృత్తిని విశ్లేషించి వామాచార గుణాన్ని సూక్ష్మ వివేచన చేయండి.
4) కాసుల పురుషోత్తమ కవి "ఆంధ్రనాయక శతకానికి" తెలుగు శతక సాహిత్యంలో గల స్థానాన్ని వివేచించండి.
పార్ట్ (బి)
5) ఈ క్రింది ప్రశ్నలలో మూడింటిని అడిగిన పద్ధతిలో వివరించండి
ఎ) శిల్ప దృక్పథం
"ఇమ్ముగఁగాకుళమ్ము మొదలీవరకుఁగల యాంధ్ర పూర్వ రా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదయాంతర మేలో చలించి పోవునా
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్ని జ
న్నమ్ములుగాఁగా నీ తనువునన్ బ్రవహించునొ యాంధ్రరక్తముల్"
బి) సామాజిక చారిత్రక దృక్పథం
"చీనిచీనాంబర్ సువర్ణౌ
ఢ్యాణ కంకణ కింకిణి యుత
మా పసిడి పళ్లెరము నిజహ
స్తాబ్జముల రేడొసగె లకుమకు"
సి) తాత్త్విక దృక్పథం
"పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను
మధుపమయ్యెద చందమామనయ్యెదను
మేఘమయ్యెద వింతమెరుపునయ్యెదను
అలరునయ్యెద చిగురాకు నయ్యెదను
పాటనయ్యెద వార్ధి భంగమయ్యెదను"
డి) పాత్రల మనస్తత్వ దృక్పథం.
"నిప్పులు చిమ్ముకొంటూ
నింగికి నేనెగిరి పోతే
నిబిడాశ్చర్యంతో వీరె
నెత్తురు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె"
6) గురజాడ కథానికలు స్పృశించిన సామాజిక స్పృహ విశదీకరించునది.
7) శారద లేఖలు ఆంధ్ర వాఙ్మయంలోని లేఖా సాహిత్యంలో ధృవతారలు - విశ్లేషించునది.
8) అల్పజీవి నవలలో రావిశాస్త్రి చూపించిన పరిష్కారంలోని అనైతికతను వివరిస్తూ రచయిత దృక్పథాన్ని, నవలా లక్ష్యాన్ని బేరీజు వేయునది.
Wednesday, October 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment