Thursday, September 10, 2009

కళా సౌందర్యాత్మక దృక్పథం

ఒక శిల్పి శిలను అందమైన శిల్పంగా మలిచినట్లు ఒక కవి కావ్యాన్ని తీర్చిదిద్దుతాడు. సరిగ్గా కళా సౌందర్యాత్మక దృక్పథం లేదా కథా రచనా శిల్ప దృక్పథం కనిపించేది ఇక్కడే. ప్రతి కవీ తాను రాస్తున్న కావ్యాన్ని పేలవంగా రాయడు. అందులో సాహితీ మర్మాలను చొప్పించి వాఙ్మయ చరిత్రలో ఆ కావ్యం మిగిలిన వాటికన్న భిన్నంగా రమణీయంగా ఉండేలా రచిస్తాడు.

ఒక పద్యంలో పరుషాక్షరాలున్నాయా, సరళాక్షరాలున్నాయా, సుదీర్ఘ సమాసాలున్నాయా, వర్ణ్య వస్తువుకు తగిన శైలి ఉందా, రసం ఏది, అందులోని విభావ అనుభావ సంచారీ సాత్త్విక స్థాయిభావాలు స్థితిగతులేమిటి, వక్రోక్తి ఔచిత్యం, పాకం, రీతి, వృత్తి, శయ్య, అలంకారాలు లాంటి అంశాలు ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయో విద్యార్థి విశ్లేషించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సాహిత్యాంశాల్ని విద్యార్థి స్థూలంగానయినా తెలుసుకుంటే ఈ దృక్పథంతో వ్యాఖ్యానించడం సులభతరమవుతుంది.

No comments:

Post a Comment