Thursday, September 24, 2009

నమూనా ప్రశ్నాపత్రం ఎ: పేపర్ - 1

పార్ట్ (ఎ)

1) ఏదేని మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయవలెను.

ఎ) తెలుగు భాషాభివృద్ధి - ప్రసార మాధ్యమాల పాత్ర
బి) ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం - ప్రాచీనత
సి) ఆదర్శ అనువాదం
డి) తెలుగులో అన్యదేశ్యాలు

2) తెలుగు వాక్య రచనా విన్యాసంలో ప్రాచీన ఆధునిక యుగాలలో జరిగిన మార్పు చేర్పులను తులనాత్మకంగా బేరీజు వేయండి.

3) తెలుగు ప్రాంతంలోని వివిధ మాండలిక భేదాలను సోదాహరణంగా చర్చించండి.

4) తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావాన్ని వివరించి, దీనివల్ల తెలుగు భాషకు ఒనగూరిన ప్రయోజనాన్ని వివరించండి.

పార్ట్ (బి)

5) ఏదేని మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయవలెను.
ఎ) మార్గ-దేశి కవితా భేదాలు.
బి) నాచన సోముడు - నవీనగుణసనాధత్వం
సి) ప్రబంధ పరిణామక్రమ వికాసం
డి) తెలుగులో దళిత కవిత

6) ఆంధ్రమహాభారత రచనకు గల సాహిత్య చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.

7) తెలుగు నవల ఆవిర్భావ వికాసాల వెనుక ఉన్న ఉద్యమ నేపథ్యాలు విశ్లేషించండి.

8) దక్షిణాంధ్ర సాహిత్య యుగ స్వభావాన్ని విశ్లేషించి యక్షగాన ఆవిర్భావ వికాసాలను సోదాహరించండి.
-Akella Raghavendra

No comments:

Post a Comment