Thursday, September 10, 2009

తాత్త్విక దృక్పథం

ఇందులో అభ్యర్థి ప్రధానంగా రెండు అంశాలను గుర్తించాలి. ఒకటి, తాత్త్విక దృక్పథం అంటే హిందూ తత్త్వశాస్త్రానికి సంబంధించిన అంశాలతో చేసే చర్చ. రెండు, కవి యొక్క తత్త్వం అంటే Ideologyకి సంబంధించిన అంశాలపై వ్యాఖ్య.

భగవద్గీత, మనస్మృతి, వేదాలు, పతంజలి యోగశాస్త్రం, భాగవతం, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు లాంటి గ్రంథాలలోని తత్త్వశాస్త్ర సంబంధమైన విషయాల్ని ఆధారం చేసుకుని పద్యాల్ని విశ్లేషించగలగాలి.

ఇక రెండవ అంశం, ఒక పద్యంలో ప్రతిబింబించిన కవి తత్త్వాన్ని అంటే Ideologyని, భావ జాలాన్ని, దృక్పథాన్ని వ్యాఖ్యానించగలగాలి. నన్నయగారి శకుంతలోపాఖ్యానంలోని ప్రతి పద్యంలోనూ ఆయన రచనా దృక్పథం, భావజాలం, తత్త్వం ప్రతిఫలిస్తాయి. అలాగే తిక్కనాది కవుల పద్యాల్లోనూ అంతే! ఈ దృక్పథంతో వ్యాఖ్యానం చేసేటప్పుడు అభ్యర్థి ఆ పద్యం రాసిన కవి భావజాలం ఏమిటో, అది ఏ విధంగా ఆ పద్యంలో ప్రకటితమైందో విశ్లేషించగలగాలి.

No comments:

Post a Comment