Thursday, September 24, 2009

నమూనా ప్రశ్నాపత్రం ఎ: పేపర్ - 2

పార్ట్ (ఎ)

1) ఈ క్రింది ప్రశ్నలలో మూడింటిని అడిగిన పద్ధతిలో వివరించండి

ఎ) కళాసౌందర్య దృక్పథంతో విమర్శ రాయండి.

"ఆ దుష్యంతుఁడనంతసత్త్వుడు సమస్తాశాంత మాతంగ మ
ర్యా దాలంకృతమైన భూవలయ మాత్మయత్తమై యుండగా
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
నాదిక్షత్రి చరిత్రనేలె నజితుండై బాహువీర్యంబున్"

బి) చారిత్రక - సామాజిక దృక్పథంతో విమర్శ వ్రాయండి

"ఏమీ ! పార్థుడు నీవు దండిమగలై యీ వచ్చు కౌరవ్య సం
గ్రామ క్షొభము బహుదర్పమునఁదీర్పం బెద్దమిఱ్ఱెక్కి మి
మ్మెల్లన్ వెరగంది చూచెదముగా, కీసారెకుంబోయిరా
భీముండిత్తఱి రిత్తమాటలకు కోపింపడు సూపెంపఱన్"

సి) తాత్త్విక దృక్పథం

"గురు భుజశక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా
హరుని శరాసనంబుఁగొనియాడుచు పాడుచుఁగొంచు వచ్చి, సు
స్థిరముగ వేదిమధ్యమునఁజేర్చిన దానికి ధూపదీపముల్
వీరులును గంధమక్షతలు వేడుకనిచ్చిరి చూడనొప్పుగన్"

డి) పాత్రల మనస్తత్వ దృక్పథం.

"అకటా ! యేమని దూఱుదానమిము ? నాథా ! వేగుజామయ్యెఁబొం
దికగాఁబాదము లొత్తరమ్మనుట గానీ ! యొంటియేమో కదా !
నికటక్షోణికి నేఁగుదెమ్మనుటగానీ ! కొంత నెయ్యంపుఁబూ
నిక తోఁ గన్నులు విచ్చి చూచటయు కానీ ! లేదు యొక్కింతయున్"

2) గుణనిధి కథలోని యజ్ఞదత్తుడు, సోమిదేవమ్మ, గుణనిధి పాత్రల్లోని మానవ మనస్తత్వ రీతులను విశ్లేషించండి.

3) కాసుల పురుషోత్తమకవి 'ఆంధ్రనాయకశతకం'లో ప్రకటితమైన సామాజికత, కవి హృదయావేదన ఆవిష్కరించండి.

4) శాలీనుడి వింత ప్రవృత్తా ? సుగాత్రి పాతివ్రత్యమా ? ఏది ఈ కథను తెలుగు సాహిత్యంలోనే విశిష్ట ఉపాఖ్యానంగా మలచింది ? చర్చించండి.

పార్ట్ (బి)

5) ఈ క్రింది ప్రశ్నలలో మూడింటిని అడిగిన పద్ధతిలో వివరించండి

ఎ) సామాజిక - చారిత్రక దృక్పథం

"అజ్జాయింతువో చుట్టు మార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుం
డుజ్జీలేని దయాస్వభావుఁడు ప్రభావోల్లాసి ముప్ప్రొద్దులున్
గజ్జెం గట్టెడి నాట్యగాఁడతఁడు సాక్షాత్కారమున్ జెందినన్
మజ్జాత్యుద్ధరణంబుఁగల్గు గలదమ్మా పొమ్ము సేవింపఁగన్"

బి) పాత్రల మనస్తత్వం.

నాలో కదిలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా సమర్చనంగా
త్రిలోకాలలో, త్రికాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ....

సి) కళాసౌందర్య దృక్పథం

"రంగురంగుల సొగసు చీరల ధరించి
నవ్వు వెన్నెల గాయు క్రొన్ననల నడుమ
రాడి వాడని యీ విరిచేడె తొల్చు
మంచు ముత్తియముల గన మది కరంగు"

డి) తాత్త్విక దృక్పథం.

నిన్ను రాయలు కన్నులందున
నిలపినందుకు పరితపించను
కాని దేశమ్మును తృణమ్మటు
కాలద్రోయుట ఎట్లు సైతును ?
దేశమొకదెస నీవు ఒకదెస
తేల్చుకొను యెయ్యది ఘనమ్మో
వ్యక్తి సంఘములందు ఎయ్యది
ప్రథమ గణ్యమొ చెప్పవమ్మా

6) ఆంధ్ర ప్రశస్తిలోని కరుణ వీర రసాల సమ్మిశ్రణాన్ని వివేచించండి

7) "శారద లేఖలు హిస్టరీ జాగ్రఫీలు ఇండ్లలో గుట్లు కావు. ఈ నాటి విద్యాధికుల తీవ్రతర తర్కోపతర్కములకు ఒప్పుచున్న రాజకీయ సాంఘిక నైతిక మతాది విషయాలు స్త్రీలకు సంబంధించిన విషయాలు పరిశీలింపబడి ప్రాక్‌పశ్చిమములకు కర్మసిద్ధాంత సమన్వయము చేయుచున్నవి" చర్చించండి.

8) నైతిక సూత్రాల ఆధారంగా మనోరమ పాత్రను విశ్లేషిస్తూ రావిశాస్త్రి 'అల్పజీవి'లో రచయిత ప్రదర్శించిన తత్త్వాన్ని విశ్లేషించండి.
-Akella Raghavendra

No comments:

Post a Comment