ఒక పద్యంపై వ్యాఖ్యలో ఈ క్రింది అంశాలు రాయాలి.
1. సందర్భం
2. తాత్పర్యం
3. అడిగిన దృక్పథానికి కావలసిన వ్యాఖ్య
4. విశేషాంశాలు
సందర్భం :అంటే ఇచ్చిన పద్యం ఏ కవి ఏ కావ్యంలో ఏ ఆశ్వాసంలో ఏ సంఘటనలో రాయడం జరిగిందో వాటిని వివరించాలి.
తాత్పర్యం :అంటే ఇచ్చిన పద్యంలోని పదాల వివరణ, ఆ పద్య తాత్పర్యం క్లుప్తంగా రాయాలి.
అడిగిన దృక్పథానికి కావలసిన వ్యాఖ్య :అంటే సామాజిక చారిత్రక, తాత్త్విక, పాత్రల మనస్తత్త్వ, కథా రచన - ఇలా నాలుగు దృక్పథాల్లో ఇచ్చిన పద్యాన్ని ఏ దృక్పథంలో అడిగారో ఆ దృక్పథాన్ని ఆధారం చేసుకుని ఆ పద్యాన్ని వ్యాఖ్యానించాలి. మొత్తం వ్యాఖ్యానంలో అసలయిన కీలకభాగం ఇది. ఇందులోనే అభ్యర్థి విమర్శనా దృష్టి, నిశిత పరిశీలన, అవగాహన జ్ఞానం ప్రస్ఫుటమవ్వాలి.
విశేషాంశాలు :అంటే ఇచ్చిన పద్యంలోని అడిగిన దృక్పథంలో కాకుండా ఉన్న ఇతరత్రా విశేషాంశాల్ని అభ్యర్థి వివరించగలగాలి. దీనివల్ల అభ్యర్థికి ఆ పద్యంపై సమగ్ర సంపూర్ణ అవగాహన ఉందన్న విషయం పరీక్షాధికారికి తెలుస్తుంది.
Thursday, September 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment