(ఈనాడు, సోమవారం, జనవరి 17, 2005)
గ్రూప్-1 మెయిన్స్‌లో తెలుగు సాహిత్యానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే...
* మరీ తికమక పెట్టే ప్రశ్నలు రావడంలేదు.
* దాదాపు అన్ని అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి
* ఛాయిస్ దదాపు సగానికి సగం ఉండడం, లఘు వ్యాఖ్యలు తప్పనిసరిగా రాయాలన్న నిబంధన లేకపోవడం అభ్యర్థికి అనుకూలం.
భాషాశాస్త్ర చరిత్రలో...
పేపర్ - 1 పార్ట్ 'ఎ'లో భాషా చరిత్ర ఉంది - ఇందులో 9 అధ్యాయాలున్నాయి. ఈ తొమ్మిదీ చదవాల్సిన అవసరం లేదు. ఈ విభాగంలో అభ్యర్థి అయిదు ప్రశ్నలకు కనిష్ఠంగా 2, గరిష్ఠంగా మూడు రాయాల్సి ఉంటుంది. అయిదో ప్రశ్నలో ఆరు లఘు ప్రశ్నలకు మూడు రాయాలి. సాధ్యమైనంతవరకు లఘు ప్రశ్నల జోలికి వెళ్ళకుండా వ్యూహం రూపొందించుకోవాలి.
సూచనలు
* ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం, ఆంధ్రం - తెనుగు - తెలుగు, ఆదాన ప్రదానాలు, అర్థ విపరిణామం, వాక్యం, ప్రాఙ్నన్నయ యుగం, మాండలికాలు, అధికార భాషగా తెలుగు, భాష ఆధునికీకరణ, అనువాదం - అనే అంశాలను తప్పక చదవాలి. వీటిపై పట్టున్న అభ్యర్థి మిగిలిన అధ్యాయాన్ని / విడిచిపెట్టవచ్చు.
* ఆధునిక సాహిత్యంలో మాండలిక ప్రయోగం, తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి అనువాద ప్రాధాన్యం, తెలుగు భాషాభివృద్ధికీ, ఆధునికీకరణకూ ప్రసార మాధ్యమాల పాత్ర అనే - అనే మూడు ప్రశ్నలను అదనంగా, తప్పనిసరిగా చదవాలి.
* మాండలికాల నిర్వచనం, ప్రమాణ భాష నిర్వచనం, భాష ఆధునికీకరణ, భాష అభివృద్ధి - వీటి స్పష్టమైన నిర్వచనాలు, జాతీయ భాష, అధికార భాష నిర్వచనాలు లాంటి వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పరీక్షలో 'నిర్వచించి' అనే పదంతో ప్రశ్న ఉన్నప్పుడు భాషా శాస్త్రపరమైన సమగ్ర నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుంది.
సాహిత్య చరిత్రలో...
పేపర్-1 పార్ట్-బి నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. వీటిలో చివరిది లఘు రూప ప్రశ్నలతో కూడినది. అయిదింటిలో కనిష్ఠంగా 2, గరిష్ఠంగా 3 రాయాల్సి ఉంటుంది. పార్ట్ 'ఏ' నుంచి అప్పటికే 3 రాయగలిగి ఉంటే ఈ విభాగం నుంచి రెండు ప్రశ్నలు ఎంచుకుంటే చాలు.
సూచనలు
* ప్రాఙ్నన్నయ యుగ సాహిత్యాన్ని వ్యాసరూప ప్రశ్నగా చదివి తీరాలి.
* ప్రాచీన ప్రక్రియలు సిలబస్‌లో 14 ఉన్నాయి. వీటిలో ప్రబంధం, పురాణం, శతకం, యక్షగానం, పద కవిత అనేవి చదివితే సరిపోతుంది.
* భక్తి - సామాజిక సంస్కరణ ఉద్యమాలపై సంపూర్ణ అవగాహన అవసరం.
* ఆధునిక ఉద్యమాలు, ధోరణులు మొత్తం తొమ్మిదింటినీ చదవాలి.
* ఆధునిక ప్రక్రియలను చదవకున్నా ఫర్వాలేదు.
* ప్రాచీన ప్రక్రియల సంగ్రహ వ్యాసం, ప్రాచీన ఉద్యమాల సంగ్రహ వ్యాసం, అలాగే ఆధునిక ప్రక్రియల, ఆధునిక ఉద్యమాల ధోరణుల సంగ్రహ వ్యాసాలు - అనే 4 ప్రశ్నలను తప్పక చదవాలి.
* ప్రక్రియ, ఉద్యమం, ధోరణి - ఈ మూడింటి శాస్త్రీయమైన నిర్వచనాలు తెలుసుకోవాలి. ఉద్యమం, ధోరణి అనే పరిభాషా పదాలకు అర్థ వివరణ, భేద సాదృశ్యాలు తెలుసుకోవాలి.
Wednesday, September 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment